ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమిత్‌షా ర్యాలీకి ఒక్క రోజు ముందు... బిహార్‌ సంకీర్ణంలో కుతకుతలు

ABN, First Publish Date - 2020-06-06T18:11:09+05:30

నితీశ్ నేతృత్వంలోని సంకీర్నంలో ఒక్కసారిగా లుకలుకలు బయటపడ్డాయి. ఆదివారం నుంచి బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ ప్రచారాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : నితీశ్ నేతృత్వంలోని సంకీర్నంలో ఒక్కసారిగా లుకలుకలు బయటపడ్డాయి. ఆదివారం నుంచి బిహార్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిజిటల్ ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టారు. అయితే... నితీశ్ నేతృత్వంలోని సంకీర్ణంలో ఎల్జేపీ భాగస్వామి. ఈ భాగస్వామి నితీశ్ కుమార్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ నితీశ్ కుమార్‌తో పొత్తు పెట్టుకున్నా... పొత్తు పెట్టుకోకపోయినా తమ మద్దతు మాత్రమే బీజేపీకే ఉంటుందని ఎల్జేపీ యువనేత, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తేల్చి చెప్పారు.


వలస కార్మికులను తిరిగి స్వస్థలాలకు చేర్చడంలో నితీశ్ నేతృత్వంలోని సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.


‘‘ఎన్నికల సమయంలో ఎవరు ప్రచార సారథి? ఎవరి నేతృత్వంలో ఎన్నికల వెళ్లాలన్నది అతిపెద్ద భాగస్వామి అయిన బీజేపీ నిర్ణయించాలి. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా... మా మద్దతు కచ్చితంగా ఉంటుంది. యథావిధిగా నితీశ్‌తో పాటే వెళ్లాలని అనుకుంటే మేము వారి వెంటే ఉంటాం. ఒకవేళ మనసు మార్చకున్నా... మా మద్దతు మాత్రం బీజేపీకే... ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం బీజేపీ వెంటే’’ అని ఆయన ప్రకటించారు. ఏది ఎలాగున్నా బిహార్‌లో తిరిగి ఎన్డీయే కూటమే అధికారకంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


242 సీట్లకు గాను 225 సీట్లలో విజయం కేతనం ఎగురవేస్తామని ప్రకటించారు. అయితే చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. నితీశ్ నాయకత్వ సమర్థతపై తమకు ఎలాంటి సందేహమూ లేదని, అయితే వలస కార్మికుల తరలించే విషయంలో మాత్రం ఆయన వైణల్యం చెందారని తాము భావిస్తున్నట్లు బీజేపీ నేతలు స్పష్టం చేశారు.


కేంద్రాన్ని కోరి మరిన్ని శ్రామిక్ రైళ్లను వేయించుకుంటే బాగుండేదని బీజేపీ అభిప్రాయపడుతోంది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాత్రం నితీశ్ సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తన డిజిటల్ ప్రచారంలో ఈ సందిగ్ధతకు తెరిదించి, స్పష్టమైన సంకేతాలిస్తారని బిహార్ నేతలు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-06T18:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising