ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా గోప్యత వల్ల కరోనా ప్రపంచమంతా పాకింది: ట్రంప్

ABN, First Publish Date - 2020-07-05T21:16:53+05:30

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై నిప్పులు చెరిగారు. సెల్యూట్ టూ అమెరికా పేరిట నిర్వహించిన ర్యాలీలో ఆయన కమ్యునిస్టు దేశంపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా నుంచి వచ్చిన కరోనా అమెరికాను దెబ్బకొట్టక ముందు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయిందన్నారు. ‘సుంకాల కారణంగానే ఇతర దేశాలతో మనం గొప్ప వాణిజ్య ఒప్పందాలు చేసుకోగలిగాం. గతంలో ఇవేమీ ఉండేవి కావు. మనతో వాణిజ్యం ద్వారా దశాబ్దాల పాటు లాభపడ్డ దేశాలతోనే ప్రస్తుతం అమెరికాకు లాభం చేక్చూర్చే ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అమెరికా కరోనా బారిన పడకముందు ఆ దేశాల నుంచి వచ్చే వేల కోట్ల  నిధులు అమెరికా ఖజానాలో పడేవి. ప్రస్తుతం మనం గౌన్లు, మాస్కులు, ఇతర శాస్త్రచికిత్స పరికరాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు ఇవన్నీ..కరోనాకు కారణమైన చైనాలోనే తయారయ్యేవి.  చైనాలోని గోప్యత, మోసం, వాస్తవాన్ని దాచడం వంటి వాటి కారణంగా కరోనా ప్రపంచమంతా వ్యాపించింది. దీనికి చైనా ప్రభుత్వం బాధ్యత తీసుకునేలా చేయాలి’ అని ట్రంప్ తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-07-05T21:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising