ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాకు చైనా వార్నింగ్! తగిన జావాబు చెబుతామంటూ ఘాటు కామెంట్స్

ABN, First Publish Date - 2020-06-23T23:00:40+05:30

చైనా ప్రచురణ సంస్థలకు అమెరికాలో ఉన్న మీడియా గుర్తింపును అమెరికా ప్రభుత్వం ఇటీవలే తొలగించింది. చైనా సెంట్రల్ టెలివిజన్, చైనా న్యూస్ సర్వీస్, పీపుల్స్ డైలీ, ది గ్లోబల్ టైమ్స్‌ను కేవలం విదేశీ సంస్థలుగానే పేర్కొంది. ఈ సంస్థలు చైనా అనుకూల ప్రచారానికి దిగుతున్నాయని కూడా ఈ సందర్భంగా అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా చర్యలపై చైనా మండిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా వార్తా సంస్థలకు అమెరికాలో ఉన్న మీడియా గుర్తింపును అమెరికా ప్రభుత్వం ఇటీవలే తొలగించింది. చైనా సెంట్రల్ టెలివిజన్, చైనా న్యూస్ సర్వీస్, పీపుల్స్ డైలీ, ది గ్లోబల్ టైమ్స్‌ను కేవలం విదేశీ సంస్థలుగానే పేర్కొంది. ఈ సంస్థలు చైనా అనుకూల ప్రచారానికి దిగుతున్నాయని కూడా ఈ సందర్భంగా అమెరికా ఆరోపించింది. అయితే అమెరికా చర్యలపై చైనా మండిపడింది.


మీడియ స్వేఛ్చ‌కు, భావప్రకటన స్వేచ్ఛకు పరిరక్షకురాలిగానే చెప్పుకునే అమెరికా ద్వంధ వైఖరి ఈ చర్యతో బయటపడిందని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రచ్ఛన యుద్ధకాలం నాటి మనస్థత్వాన్ని అమెరికా వదులుకోవాలని చైనా సూచించింది. అలా జరగని పక్షంలో తాము కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. గతంలో చైనా కూడా తమ దేశంలో అడుగుపెట్టద్దంటూ కొందరు అమెరికా జర్నలిస్టులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.


ఇక కరోనా సంక్షోభం తరువాత చైనా ప్రపంచ ముందు ప్రస్తుతం దోషిగా నిలబడింది. కానీ తన విస్తరణ కాంక్ష కారణంగా ఇప్పటికే పొరుగు దేశాలతో చైనా ఘర్షణ పడుతోంది. సరిహద్దు విషయంలో భారత్‌తోనూ.. సెన్‌కాకు ద్వీప సముదాయంపై ఆధిపత్యం విషయంలో జపాన్‌తోనూ చైనాకు అభిప్రాయబేధాలు ఉన్నాయి.


ఇక భారత్‌తో ఉన్న అభిప్రాయభేదాలు గాల్వాన్‌లో హింసాత్మక ఘటనలకు దారితీసిన విషయం తెలిసిందే. పెద్ద సైన్యాన్ని చూపి ఇండియాను బెదిరించాలన్న చైనా వ్యూహం బెడికొట్టింది. భారత్‌లో చైనా వ్యతిరేకత మిన్నుముట్టింది. ఈ నేపథ్యంలో సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు నిర్ణయించాయని తాజా సమాచారం.


మరోవైపు..  సెన్‌కాకూ ద్వీపాలపై తన అజమాయిషీని సుస్థిరం చేసుకునేందుకు జపాన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ ద్వీపసముదాయమున్న ప్రాంతాన్ని అధికారికంగా పేరు మార్చడం ద్వారా వాటిపై చట్టపరంగా పూర్తి హ్కక్కులు తమవేనని చైనాకు జపాన్ చెప్పకనే చెప్పింది.

Updated Date - 2020-06-23T23:00:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising