ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాకు టీకా తలనొప్పులు...!

ABN, First Publish Date - 2020-12-31T02:18:06+05:30

కరోనా టీకాలతో చైనాకు కొత్త తలనొప్పులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచయవనికపై తన సత్తా చాటాలనుకుంటోంది చైనా..! రక్షణ రంగం, వాణిజ్యం, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో తన ఉనికిని చాటుకోవాలని..వీలైతే ఆధిపత్యం నెలకొల్పాలని ప్రయత్నిస్తొంది. ఇక కరోనా మహ్మమ్మారికి తనే కారణమంటూ వస్తున్న ఆరోపణల్ని టీకా తయారీ ద్వారా తుడిచేయాలని కూడా ప్రయత్నిస్తోంది. ప్రముఖ ఫార్మా కంపెనీల ఖరీదైన కరోనా టీకాలను పేద దేశాలు కొనుగోలు చేయలేవు కాబట్టి..ఆ దేశాలకు అత్యంత చౌకగా టీకాలు తయారు చేసి ఇవ్వాలని చూస్తోంది. అందుకే..ప్రస్తుతం చైనాకు చెందని ఐదు కరోనా టీకాలు  క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. మరి ఆయా దేశాల ప్రజల్లో చైనా టీకాపై నమ్మకముందా..అంటే లేదనే సమాధానం కొన్ని సందర్భాల్లో వినిపిస్తోంది. అయితే..ఈ పరిస్థితి కారణం చైనా స్వయంకృతాపరాథమే!


తమ టీకా మంచి పనితీరు కనబరుస్తోందని చైనా చెబుతోంది. చైనాకు చెందిన సైనోఫార్మ్ టీకాకు యూఏఈ, బాహ్రెయిన్ దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతించాయి. కానీ..క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డాటాను మాత్రం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. చైనా కూడా ఈ విషయంలో గోప్యతే పాటిస్తోంది. పాశ్చాత్య ఫార్మా కంపెనీలు మాత్రం తమ క్లినికల్ ట్రయల్స్ డాటాకు ఇవ్వటమే కాకుండా..వివిధ దేశాల్లో అత్యవసర అనుమతులు కూడా సంపాదించేశాయి. దీంతో..రేసులో వెనకబడిపోయినట్టు ఫీలవుతున్న చైనా..తన టీకాలకు అనుమతులు ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతోంది. అయితే..చైనా పాటిస్తున్న గోప్యం కారణంగా ఆయా దేశాల ప్రజల్లోనూ నమ్మకం సన్నగిల్లుతోంది. చివరికి పాక్ ప్రజలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో..తన టీకాలపై నమ్మకం పెంపొందించేందుకు చైనా నానా తంటాలూ పడుతోంది.

Updated Date - 2020-12-31T02:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising