ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌కు చైనా డ్రోన్ల సరఫరా! ఒక్కోదాంట్లో 12 క్షిపణులు!

ABN, First Publish Date - 2020-07-06T15:51:45+05:30

పాకిస్థాన్‌కు నాలుగు ఎటాక్ డ్రోన్లు దాడి చేసే డ్రోన్లు సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు ఎటాక్ డ్రోన్లను(దాడి చేసే డ్రోన్లు) సరఫరా చేసేందుకు చైనా సిద్ధమవుతోంది. ఒక్కో డ్రోన్‌లో..నేలపై లక్ష్యాను ఛేదించగలిగిన 12 క్షిపణులను అమర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌, గ్వదార్ పోర్టు భద్రత కోసమే వీటిని సరఫరా చేస్తున్నట్టు సమచారం. మొత్తం నాలుగు డ్రోన్లు, రెండు కమాండ్ సెంటర్‌లతో కూడిన రెండు వ్యవస్థలను చైనా పాక్‌కు సరఫరా చేయనుంది.


అయితే ఈ డ్రోన్ల పనితీరు అంతంత మాత్రమేనని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వీటిని యూఏఈ మద్దతు కలిగిన శక్తులు లిబియాలో వినియోగిస్తుండగా..ఆశించిన ఫలితాలు రావట్లేదని వినికిడి. గత రెండు నెలల్లోనే ఏకంగా నాలుగు చైనా డ్రోన్లు ప్రత్యర్థి వర్గాలు కూల్చేసాయట.


మరోవైపు..పాక్ భాగస్వామ్యంతో జీజే-2 ఎటాక్ డ్రోన్లను ఉత్పత్తి  చేసేందుకు కూడా చైనా సిద్ధమవుతోంది. వింగ్ లూంగ్-2 అనే చైనా డ్రోన్‌కు అదనపు ప్రత్యేకతలను జోడించడం ద్వారా జీజే-2 రూపకల్పన జరిగింది. ఇరు దేశాల సంయుక్త భాగస్వామ్యంలో మొత్తం 48 జీజే-2లను నిర్మించాలని చైనా యోచిస్తోంది.


బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట చైనా వివిధ దేశాలను వాణిజ్య బంధంలో ఏకంగా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కమ్యునిస్టు దేశం ఇప్పటికే పాక్‌లో 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అనేక రోడ్లు, నౌకాశ్రయాల నిర్మాణం చేపడుతోంది. వీటి రక్షణ కోసం పాకిస్థాన్‌ను అవసరమైన ఆయుధ సంపత్తిని కూడా సరఫరా చేస్తోంది.

Updated Date - 2020-07-06T15:51:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising