ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా బుడుగులా మజాకా!

ABN, First Publish Date - 2020-03-12T07:59:08+05:30

ఎప్పుడో గానీ రాని సెలవులు ఒక్కసారి గంపగుత్తగా వచ్చిపడితే? చైనాలోని వుహాన్‌ బడుల్లో చదువుతున్న చిన్నారులది ప్రస్తుతం ఇదే సంబురం. నగరాన్ని కరోనా పట్టిపీడిస్తుండటంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డింగ్‌టాక్‌ యాప్‌ ద్వారా హోంవర్క్‌
  • ఆ బెడద తప్పేందుకు సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చిన పిల్లలు
  • యాప్‌స్టోర్‌ నుంచి డింగ్‌టాక్‌ మాయమైపోవాలనే ఎత్తుగడ

వుహాన్‌, మార్చి 11: ఎప్పుడో గానీ రాని సెలవులు ఒక్కసారి గంపగుత్తగా వచ్చిపడితే? చైనాలోని వుహాన్‌ బడుల్లో చదువుతున్న చిన్నారులది ప్రస్తుతం ఇదే సంబురం. నగరాన్ని కరోనా పట్టిపీడిస్తుండటంతో అక్కడ బడులకు నిరవధికంగా సెలవులిచ్చేశారు. అయితే పిల్లలకు విద్యాసంవత్సరం వృధా కాకుండా ఉండేందుకు అక్కడి స్కూల్‌ యాజమాన్యాలు సాంకేతికత సాయాన్ని తీసుకున్నాయి. డింగ్‌ టాక్‌ అనే యాప్‌ ద్వారా పిల్లలకు హోంవర్క్‌, అసైన్‌మెంట్లు ఇచ్చారు.


సెలవుల మజాలో మునిగిన పిల్లలకు సహజంగానే ఇది రుచించలేదు. ఏదైనా యాప్‌కు తక్కువ రేటింగ్‌ వస్తే దాన్ని యాప్‌స్టోర్‌ నుంచి డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే బుడతలు తమ బుర్రలకు పదునుపెట్టారు. హోంవర్క్‌ బెడదను తప్పించుకునేందుకు డింగ్‌టాక్‌ యాప్‌కు తక్కువ రేటింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఈ యాప్‌ రోజుల వ్యవధిలో 4.9 నుంచి 1.4కు పడిపోయింది. తక్కువ రేటింగ్‌ ఇవ్వడమే కాకుండా.. సెటైర్ల రూపంలో కామెంట్లు పెట్టారు బుడుగులు. ‘యాప్‌కు నేను ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇద్దామనుకున్నాను. కానీ వాయిదాల పద్ధతి మేలని సింగిల్‌ స్టార్‌ నుంచి మొదలు పెట్టాను’ ఓ తుంటరి కామెంట్‌ పెట్టాడు. రేటింగ్‌ దారుణంగా పడిపోయినా యాప్‌ సీఈవో చెన్‌ హాంగ్‌ అసహనం వ్యక్తం చేయలేదు.


పైగా ‘‘పిల్లలు కదా.. ఇలానే చేస్తారు. ఒకవేళ నేను వారి అంత వయసుంటే హోంవర్క్‌ను తప్పించుకునేందుకు సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌నే ఇచ్చేవాడిని’’ అని పేర్కొన్నారు. అయితే, యాప్‌స్టోర్‌ నుంచి డింగ్‌టాక్‌ ఇంకా మాయమైపోలేదు. ‘‘మీరు బాగా చదువుకునేందుకే నేను పనిచేస్తాను. ఇకనైనా సింగిల్‌ స్టార్‌ రేటింగ్‌ ఇవ్వకండి’’ అంటూ పిల్లలకు యాప్‌ చెబుతున్నట్లుగా డింగ్‌టాక్‌లో ఓ పాటను పెట్టారు. మరి.. ఇది విని అయినా పిల్లలు మారతారా?

Updated Date - 2020-03-12T07:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising