ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాను రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించాలి : బాబా రామ్ దేవ్

ABN, First Publish Date - 2020-04-05T01:23:21+05:30

కోవిడ్-19 మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించడానికి కారణం చైనాయేనని యోగా గురువు బాబా రామ్ దేవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించడానికి కారణం చైనాయేనని యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం రాజకీయంగా, ఆర్థికంగా చైనాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీనికోసం భారత దేశం దౌత్యపరంగా చొరవ తీసుకోవాలని కోరారు. 


బాబా రామ్ దేవ్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘చైనా వాస్తవంగా అమానవీయ, అనైతిక చర్యకు పాల్పడింది, యావత్తు ప్రపంచాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టింది. ఇందుకు రాజకీయంగా, ఆర్థికంగా బహిష్కరించడం ద్వారా చైనాను అంతర్జాతీయ సమాజం శిక్షించాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశం దౌత్యపరమైన చొరవను తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.


కరోనా వైరస్ మొట్టమొదటిసారి గత ఏడాది నవంబరులో చైనాలోని వూహన్ సిటీలో కనిపించింది. అమెరికా వంటి దేశాలు ఈ వైరస్ ప్రపంచానికి విస్తరించడానికి చైనాయే కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2020-04-05T01:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising