ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దు పరిస్థితులపై చైనా ఏమన్నదంటే..

ABN, First Publish Date - 2020-07-09T21:48:08+05:30

గల్వాన్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: గల్వాన్ లోయ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మెరుగుపడుతున్నాయని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్‌తో మరోసారి చర్చలు నిర్వహిస్తామని, సరిహద్దు విషయంలో ఇకముందు ఎలాంటి నిబంధనలను పాటించాలని అనే విషయాలపై ఇందులో చర్చిస్తామని వివరించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావ్ లిజియన్ మాట్లాడుతూ, కమాండర్ స్థాయిలో చర్చలు జరిగిన అనంతరం గల్వాన్ లోయలో ఇరు దేశాల సైన్యాలు కూడా వేగంగా వెనక్కి మళుతున్నాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. ‘సరిహద్దు వద్ద పరిస్థితులు అదుపులో ఉన్నాయి. మెరుగుపడుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో భారత్‌తో మరిన్ని చర్చలు నిర్వహిస్తాం. సైనిక పరమైన చర్యలే కాకుండా ప్రభుత్వ స్థాయిలో కూడా చర్చలు నిర్వహించనున్నాం. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడంలోనే కాకుండా చర్చల ద్వారా సాధించిన పరిష్కారాన్ని అమలుచేయడంలోనూ భారత్ మాకు పూర్తిగా సహకరిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఝావ్ పేర్కొన్నారు. అయితే చైనా తమ సైన్యాన్ని ఎప్పటిలోగా వెనక్కి తీసుకుంటుంది, ఎంతవరకు వెనక్కి తీసుకుంటుంది అనే విషయాలపై మాత్రం ఆయన ఎటువంటి సమాచారాన్ని వెల్లడించడకపోవడం గమనార్హం.

Updated Date - 2020-07-09T21:48:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising