ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం పాక్‌ను ఒత్తిడి చేయలేదు: చైనా

ABN, First Publish Date - 2020-12-29T17:44:40+05:30

పాక్‌కు రుణాలు మంజూరు చేసేందుకు గ్యారెంటీలు కావాలంటూ తాము పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని చైనా స్పష్టం చేసింది. ఈ విషయమై వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: పాక్‌కు రుణాలు మంజూరు చేసేందుకు గ్యారెంటీలు కావాలంటూ తాము పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని చైనా స్పష్టం చేసింది. ఈ విషయమై వస్తున్న వార్తల్లో నిజం లేదని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా పాక్ ప్రభుత్వం చైనా ఆర్థిక మద్దతుతో పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ క్రమంలో ఓ కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు పాక్ చైనా ప్రభుత్వాన్ని ఆరు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయాలంటూ కోరింది. అయితే..లోన్ మంజూరు చేయాలంటూ మరిన్ని అదనపు గ్యాంరెంటీలు ఇవ్వాలంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని చైనా కోరినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. పాక్‌ను ఒంటరిని చేస్తూ.. ఎకనమిక్ కారిడార్‌ ప్రాజెక్టుల బాధ్యతలను చైనా వదిలించుకోదలచిందనే వార్తలు అంతర్జాతీయంగా తెగ వైరల్ అయ్యాయి. 


పొరుగు దేశాలను అప్పుల ఊబిలోకి దింపి తన ఆధీనంలోకి తెచ్చుకుంటుందనే అపవాదు చైనాపై ఇప్పటికే ఉంది. ఈ నేపథ్యంలో పాక్ విషయంలో వైరల్ అవుతున్న వార్తలు తన ఇమేజీని మరింత డ్యామేజీ  చేసే అవకాశం ఉండటంతో చైనా తక్షణం స్పందించింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని..బెల్ట్ రోడ్ కార్యక్రమానికి, అందులో భాగమైన చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌కు చైనా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిథి తెలిపారు. ప్రపంచ ఆర్థికరంగం మందగించినప్పటికీ..ఈ అంశాల్లో చైనా ఆర్థిక సహాయం మరింత పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-29T17:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising