ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివాదాస్పద హాంకాంగ్ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంటు ఆమోదం

ABN, First Publish Date - 2020-05-28T21:23:35+05:30

హాంకాంగ్‌లో చైనా అధికారాన్ని చులకన చేయడాన్ని నేరంగా పరిగణించే కొత్త వివాదాస్పద బిల్లుకు చైనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: హాంకాంగ్‌లో చైనా అధికారాన్ని తక్కువ చేయడాన్ని నేరంగా పరిగణించే కొత్త వివాదాస్పద బిల్లుకు చైనా పార్లమెంటు ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఆలస్యంగా జరిగిన చైనా వార్షిక రాజకీయ సమావేశాలు ఇవాళ ఈ చట్టాన్ని ఆమోదించిన వెంటనే ముగిశాయి. కాగా హాంకాంగ్‌పై కొత్త భద్రతా బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ వ్యక్తమైంది. ఈ చట్టం అమల్లోకి వస్తే తొలిసారి చైనా భద్రతా సంస్థలు హాంకాంగ్‌లో తమ కార్యాలయాలు ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. హాంకాంగ్ కొత్త సెక్యురిటీ బిల్లుతో పాటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పీసీ) సమావేశాల చివరి రోజు పలు కీలక బిల్లులు కూడా చకచకా ఆమోదం పొందాయని చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది. చైనా పార్లమెంటు ఆమోదం పొందిన కొత్త బిల్లు ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ముందుకు వెళ్లనుండగా.. ఆగస్టు నాటికి ఇది చట్టం రూపు దాచ్చనుంది.


హాంకాంగ్‌లో పెరుగుతున్న తీవ్రవాదం, హింసను నివారించాలంటే ఈ చట్టాన్ని ప్రయోగించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల హాంకాంగ్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆయన అన్నారు. కాగా డ్రాగన్ అధికారాన్ని ప్రశ్నిస్తే ఇకపై శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హాంకాంగ్‌లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే.. స్థానిక చట్టాల ప్రకారం ప్రస్తుతం ఉన్న హక్కులను కాపాడుకోవడం లేదా ఉద్యమించడం ఎలా అన్న సందేహాలు కూడా వ్యక్తమవు తున్నాయి. 1997 జూలై 1 బ్రిటీష్ పాలకులు హాంకాంగ్‌ను చైనాకు వదిలేశారు. కాగా హాంకాంగ్ స్వంతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా చైనా తాజా బిల్లు తీసుకొచ్చిందంటూ ఇప్పటికే హాంకాంగ్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 

Updated Date - 2020-05-28T21:23:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising