ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా సీక్రెట్స్: గప్‌చుప్‌గా టీకా వేసి..నోరు విప్పద్దంటూ ఒప్పందాలు!

ABN, First Publish Date - 2020-09-27T20:32:26+05:30

చైనా ప్రభుత్వం తన ప్రజలకు గప్‌చుప్‌గా కరోనా టీకాలు వేస్తున్నట్టు సమాచారం. హై రిస్క్ కేటగిరీ వారిగా భావిస్తున్న డాక్టర్లు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, టీకా తయారీ సంస్థల సిబ్బంది, టీచర్లకు అత్యవసర ప్రాతిపదికన క్లీనికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోని టీకాను వేసినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: చైనా ప్రభుత్వం తన ప్రజలకు గప్‌చుప్‌గా కరోనా టీకాలు వేస్తున్నట్టు సమాచారం. హై రిస్క్ కేటగిరీ వారిగా భావిస్తున్న డాక్టర్లు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, టీకా తయారీ సంస్థల సిబ్బంది, టీచర్లకు అత్యవసర ప్రాతిపదికన క్లీనికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోని టీకాను వేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ విషయాలేవీ బయటకు రాకుండా.. వారి నోరు కట్టేసేందుకు కొన్ని ఒప్పందాలపై వారి సంతకాలు కూడా తీసుకుందట. మీడియాకు ఈ వార్తలు పొక్కకుండా చైనా ప్రభుత్వం జాగ్రత్త పడిందని సమాచారం.


ఈ విషయం ప్రస్తుతం పెను సంచలనానికి దారితీస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీకా ప్రభావశీలత, భద్రతపై పూర్తి ఆధారాలు లభ్యం కాకుండానే ఇలా వందల మందిపై ప్రయోగించడం తప్పని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టీకా ఇచ్చేందుకు చైనా ముందస్తు అనుమతి ఏమైనా తీసుకుందా లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.


అయితే చైనా మాత్రం ఈ అనుమానాలన్నీ అర్థ రహితమని కొట్టిపారేసింది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు ఉందని చైనా హెల్త్ కమిషన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం జూలైలో ప్రారంభమవగా జూన్‌లోనే తాము ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. 


మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త సౌమ్య విశ్వనాథన్ కూడా దీనిపై స్పందించారు. అత్యవసర ప్రాతిపదికన ప్రభుత్వాలు తమ ప్రజలకు కరోనా టీకాలు ఇవ్వచ్చన్నారు. అయితే..ఇటువంటి చర్యలను తాత్కాలిక పరిష్కారాలుగా మాత్రమే భావించాలని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాకు చెందిన మొత్తం 15 వ్యాక్సీన్ల రూపకల్పన వివిధ ప్రయోగదశల్లో ఉంది. వీటిలో నాలుగు టీకాలు ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్‌కు చేరుకున్నాయి. ఇక క్యాన్‌సీనో సంస్థ రూపొందించిన టీకాను మిలిటరీ సిబ్బందికి ఇచ్చేందుకు చైనా ప్రభుత్వం జూన్‌లోనే అనుమతించింది. 

Updated Date - 2020-09-27T20:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising