ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో వ‌ర‌ద బీభ‌త్సం... వేల ఇళ్లు నీట మున‌క‌!

ABN, First Publish Date - 2020-06-11T17:28:54+05:30

చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్‌తో ప్రపంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతుండ‌గా, ఇప్పుడు చైనాను మ‌రో విప‌త్తు చుట్టుముట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌: చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్‌తో ప్రపంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతుండ‌గా, ఇప్పుడు చైనాను మ‌రో విప‌త్తు చుట్టుముట్టింది.‌ కరోనా కార‌ణంగా లక్షలాది మంది మరణించిన తరువాత చైనాలో ఇప్పుడు ప్ర‌జ‌లు ప్రకృతి వైపరీత్యంతో బాధపడుతున్నారు. దక్షిణ చైనాలో కురుస్తున్న‌‌ వర్షాలు, భారీ వరదలు, మట్టిపెళ్ల‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌ల‌లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఇళ్లు మునిగిపోయాయి. దక్షిణ, మధ్య చైనాల‌లో వరదల కార‌ణంగా 24 మందికిపైగా ప్ర‌జ‌లు మృతి చెందార‌ని చైనా ప్రభుత్వం తెలిపింది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్ళవలసి వచ్చింద‌ని పేర్కొంది. నిరాశ్ర‌యులైన 2.30 లక్షల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించామ‌ని చైనా అత్యవసర సేవల విభాగం తెలిపింది. వారం రోజులుగా దక్షిణ చైనాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చైనాలోని ఎనిమిది రాష్ట్రాల్లోని 110 నదులు పొంగిపొర్లుతున్న కార‌ణంగా వర‌ద‌లు సంభ‌వించాయి. 

Updated Date - 2020-06-11T17:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising