ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా యాప్స్‌ని ఎందుకు నిషేధించారు?

ABN, First Publish Date - 2020-07-14T06:47:37+05:30

భారత్‌లో 59 చైనా యాప్స్‌పై నిషేధానికి సంబంధించి.. ఇటీవలి సైన్యాధికారుల చర్చల్లో భాగంగా డ్రాగన్‌ దేశం ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడంలో భాగంగా జరిగిన ఈ చర్చల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సైన్యాధికారుల చర్చలో భారత్‌కు చైనా ప్రశ్న

న్యూఢిల్లీ, జూలై 13: భారత్‌లో 59 చైనా యాప్స్‌పై నిషేధానికి సంబంధించి.. ఇటీవలి సైన్యాధికారుల చర్చల్లో భాగంగా డ్రాగన్‌ దేశం ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడంలో భాగంగా జరిగిన ఈ చర్చల్లో.. యాప్స్‌ విషయాన్ని చైనా ప్రస్తావించగానే.. భారత అధికారులు దీటుగా సమాధానం చెప్పినట్లు తెలిసింది.


‘‘దేశభద్రత, సార్వభౌమత్వం, సమగ్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ 59 యాప్స్‌ ద్వారా మా దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం లీకవుతోంది. దేశ భద్రతకూ ముప్పు ఉంది’’ అని చెప్పినట్లు సమాచారం. కాగా.. భారత్‌, చైనాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య మంగళవారం నాలుగో విడత చర్చలు జరగనున్నాయి. సరిహద్దుల్లో సైన్యాలను వెనక్కి పంపించడం.. లద్ధాఖ్‌లో పరిస్థితులపై చర్చించనున్నారు.

Updated Date - 2020-07-14T06:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising