ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టుకు పిల్లలు దూరం

ABN, First Publish Date - 2020-08-12T07:49:27+05:30

ఈసారి పంద్రాగస్టు వేడుకలు అనేక పరిమితులు, ఆంక్షల నడుమ జరగనున్నాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శనివారం ప్రధాని మోదీ ఎర్రకోటకు ఉదయం గం.7.21కు చేరుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘నెగెటివ్‌’ అని తేలిన సైనికులు, సిబ్బందితోనే విన్యాసాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 11 : ఈసారి పంద్రాగస్టు వేడుకలు అనేక పరిమితులు, ఆంక్షల నడుమ జరగనున్నాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో కేంద్రం అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. శనివారం ప్రధాని మోదీ ఎర్రకోటకు ఉదయం గం.7.21కు చేరుకుంటారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 7.30కి త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన అనంతరం 45-90 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. సైనిక విన్యాసాల్లో పాల్గొనే సిబ్బంది విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిన వారిని మాత్రమే ఆ విన్యాసాల్లో పాల్గొంటారు. అలాగే వైరస్‌ బారిన పడి కోలుకున్న జవాన్లను సైతం అనుమతిస్తారు.


ఈ వేడుకల్లో పాల్గొనే 350 మంది పోలీసులను ముందస్తు క్వారంటైన్‌ నిమిత్తం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఓ హౌసింగ్‌ కాలనీకి  ఇప్పటికే తరలించారు. అలాగే ఈ వేడుకల్లో పాల్గొనే సైనికులు, సిబ్బంది కదలికలపై ఆంక్షలు విధించారు. రిహార్సల్స్‌కు మినహాయించి ఇళ్ల వద్ద నుంచి కదలొద్దని ఆదేశించారు. వారి సహాయకులు, వంటవాళ్లు, డ్రైవర్లను సైతం ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో ఉంచారని ఆ వర్గాలు తెలిపాయి. ఈసారి పంద్రాగస్తు వేడుకల్లో స్కూల్‌ పిల్లలను దూరంగా ఉంచుతున్నారు. ఏటా 3500 మంది విద్యార్థులు పాల్గొనేవారు. కానీ ఈ సారి కరోనా భయంతో వారిని అనుమతించడం లేదు. ఇక అతిథుల సంఖ్యనూ భారీగా తగ్గించేశారు.   


Updated Date - 2020-08-12T07:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising