ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఆర్ధిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం

ABN, First Publish Date - 2020-02-08T19:33:34+05:30

ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం తీవ్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ అంశంలోనూ ప్రగతి కన్పించడంలేదనీ... ఈ ప్రభుత్వం ‘‘పేదలకు అత్యంత వ్యతిరేకంగా’’ తయారైందని ఆయన ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో చిదంబరం మాట్లాడారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వృద్ధి ఐసీయూలో ఉందనీ... ఏ అంశంలోనూ ఆశాజనకంగా లేదన్నారు. 

పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ చారిత్రక తప్పిదాలని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా  పారిశ్రామికరంగం కుదేలయిందని పేర్కొన్నారు.  అచ్చేదిన్‌ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారంటూ చిదంబరం దుయ్యబట్టారు.  పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకురావడంలేదనీ... విదేశీ నిల్వలు కూడా పడిపోతున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా వీటిపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని చిదంబరం ప్రశ్నించారు. 





Updated Date - 2020-02-08T19:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising