ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల వద్ద లంచమడిగితే ఉరిశిక్ష!

ABN, First Publish Date - 2020-11-03T17:13:13+05:30

రాష్ట్రంలో ప్రభుత్వ గోదాముల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రైతుల నుంచి లంచమడిగే అధికారులకు ఉరిశిక్ష విధించాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వరిధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వపరంగా అవసరమైనంత మేరకు కొనుగోలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : రాష్ట్రంలో ప్రభుత్వ గోదాముల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రైతుల నుంచి లంచమడిగే అధికారులకు ఉరిశిక్ష విధించాలని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి వరిధాన్యాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వపరంగా అవసరమైనంత మేరకు కొనుగోలు కేంద్రాలు, గోదాముల సదుపాయం కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నైకి చెందిన సూర్య ప్రకాశం అనే ప్రముఖుడు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ లో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు కృపాకరన్‌, పుగళేంది ఈ విషయమై ప్రభుత్వం సమగ్రమైన నివేదికను కౌంటర్‌ అఫిడ విట్‌గా సమర్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉద యం ఈ పిటిషన్‌ విచారణకు రాగా రాష్ట్ర వినియోగదారుల వాణిజ్య మం డలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధాదేవి కౌంటర్‌ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 862 ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని, అదనంగా మరికొన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నదని పేర్కొన్నారు. 


అదే సమయంలో రైతుల వద్ద గోదాముల కోసం అధికారులు ఎవరూ లంచం అడగటం లేదని, అవకతవకలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై 105 మంది అధి కారులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నివేదికలోని అంశాలను పరిశీ లించిన న్యాయమూర్తులు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, గోదాముల వద్ద అధికారు లు లంచం తీసుకోవడం లేదని చెబు తూనే అవినీతికి పాల్పిడిన అధికారు లపై చర్యలు తీసుకున్నట్టు తెలుప డం విడ్డూరంగా వింతగా ఉందని, అధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నివేదికలో స్పష్టం చేయలేదని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సవ్యంగా ధాన్యం కొనుగోళ్లు జరిగివుంటే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. 


రేయింబవళ్లు శ్రమించి పంటలు పండించే రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించక, వాటిని నిల్వ చేసుకునేందుకు గోదాములు లేక తీవ్ర ఇబ్బం దులకు గురువుతున్నారని, ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న అన్నదాతల నుంచి లంచం తీసుకునే అధికారులకు ఉరిశిక్ష విధించాలని న్యాయ మూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన 105 మంది అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు మరో నివేదిక ద్వారా స్పష్టపరచాలని ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేసి, కేసు తదుపరి విచారణను ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు.

Updated Date - 2020-11-03T17:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising