ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లలో ఉన్నా మాస్కులు ధరించండి : చెన్నై మున్సిపల్ కార్పొరేషన్

ABN, First Publish Date - 2020-03-30T21:16:48+05:30

కోవిడ్19 కేసులు నమోదైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్లలో ఉన్నా ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలంటూ గ్రేటర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోవిడ్-19 కేసులు నమోదైన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఇళ్లలో ఉన్నా ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలంటూ గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. అరుంబక్కం, పురసావల్కం, విరుగంబక్కం, సైదాపేట, పశ్చిమ మాంబలం, సంతోమ్, అలందూర్, పోరూర్, కొట్టూర్‌పురం తదితర ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు చెన్నైలో 15 కేసులు నమోదు కావడంతో ఈ తొమ్మిది ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.


నగరంలో కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికారులు ప్రత్యేకించి ఈ తొమ్మిది ప్రాంతాలపై దృష్టిపెట్టారు. ‘‘ఈ ప్రాంతాల్లోని ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని గట్టిగా కోరుతున్నాం. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదనీ... ఇంటి లోపల ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలని సూచించాం..’’ అని నగర కార్పొరేషన్ కమిషనర్ ప్రకాశ్ పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు బయటికి వెళ్లినప్పుడే మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెబుతూ వస్తుండగా... ఇళ్లలో సైతం మాస్కులు ధరించాలంటూ అధికారులు సూచించడం ఇదే తొలిసారి. 

Updated Date - 2020-03-30T21:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising