మిజోరంలో భూకంపం...
ABN, First Publish Date - 2020-06-19T03:44:30+05:30
ఐజ్వాల్: మిజోరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. చంపాయ్ ఆగ్నేయ ప్రాంతంలో 98 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 7:29 నిమిషాలకు
ఐజ్వాల్: మిజోరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. చంపాయ్ ఆగ్నేయ ప్రాంతంలో 98 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 7:29 నిమిషాలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆస్తి ప్రాణ నష్టం సంభవించినట్లుగా ఇప్పటివరకూ ఏ సమాచారమూ అందలేదు.
భారత్‌లో కొద్ది రోజులుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్‌లో ఇటీవలే భూమి కంపించింది.
Updated Date - 2020-06-19T03:44:30+05:30 IST