ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాకు సవాల్ విసురుతూ, మలబార్ నావికా దళ విన్యాసాలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-04T00:09:47+05:30

విస్తరణవాదంతో చెలరేగిపోతున్న చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విస్తరణవాదంతో చెలరేగిపోతున్న చైనాకు ‘క్వాడ్’ దేశాలు గట్టి సవాల్ విసిరాయి. భారీ మలబార్ నావికా దళ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనాను దీటుగా ఎదుర్కొంటామని చాటి చెప్పాయి. మంగళవారం ప్రారంభమైన తొలి దశ విన్యాసాలు ఈ నెల 6 వరకు జరుగుతాయి. 


భారత దేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను క్వాడ్ దేశాలు అని పిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు దేశాల నావికా దళాలు మంగళవారం నుంచి మెగా మలబార్ నావల్ ఎక్సర్‌సైజెస్‌ను ప్రారంభించాయి. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనాకు చెక్ పెట్టేందుకు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాయి. ఈ నాలుగు దేశాల నావికా దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేయడం పదమూడేళ్ళలో ఇదే తొలిసారి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఈ నెల 6 వరకు  తొలి దశ విన్యాసాలు జరుగుతాయి. 


రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత దేశానికి చెందిన ఓ జలాంతర్గామితోపాటు 5 నౌకలు, అమెరికాకు చెందిన జాన్ ఎస్ మెక్‌కెయిన్ మిసైల్ డిస్ట్రాయర్, ఆస్ట్రేలియాకు చెందిన బలరత్ ఫ్రిగేట్, జపనీస్ డిస్ట్రాయర్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ నాలుగు దేశాల సైనిక సిబ్బంది మధ్య నేరుగా సంబంధాలు ఉండవు. 


గుర్రుగా ఉన్న చైనా

మలబార్ విన్యాసాల లక్ష్యం పట్ల చైనా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో తన ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ దేశాలన్నీ చేతులు కలిపినట్లు భావిస్తోంది.  ప్రాంతీయ శాంతి, సుస్థిరతలకు ఈ విన్యాసాలు దోహదపడతాయని, అందుకు విరుద్ధంగా ఉండబోవని ఆశిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికాపై ఆరోపణలు గుప్పించింది. ప్రచ్ఛన్న యుద్ధం మనస్తత్వంతో అమెరికా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. 


Updated Date - 2020-11-04T00:09:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising