ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాతో ఉద్రిక్తత.. బీఎస్ఎన్ఎల్‌కు కేంద్రం కీలక ఆదేశాలు..

ABN, First Publish Date - 2020-06-18T15:42:17+05:30

చైనా దురాగతాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దేశంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా దురాగతాన్ని భారత ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దేశంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సంస్థను పునరుత్తేజితం చేసేందుకు 4జీ వ్యవస్థలను అప్‌గేడ్ర్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్‌కు కేంద్రం కల్పించిన విషయం తెలిసిందే. ఈ పనుల కోసం టెండర్లు వేసేందుకు ప్రవేటు సంస్థలను ఆహ్వానించాలని కూడా బీఎస్ఎన్ఎల్ నిర్ణయించినట్టు సమాచారాం. అయితే అప్‌గ్రేడ్ కోసం చైనా ఉత్పత్తులను ఉపయోగించరాదంటూ బీఎస్ఎన్ఎల్‌కు టెలికాం శాఖ ఉత్తర్వులు త్వరలో జారి చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు టెండర్ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా టెలికాం శాఖ సూచించనున్నట్టు తెలుస్తోంది. ఎమ్‌టీఎన్ఎల్‌కు కూడా ఇదే తరహా సూచనలు త్వరలో అందుతాయట.

Updated Date - 2020-06-18T15:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising