ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైట్లు ఆర్పమన్నారు సరే.. వాళ్ల బాధ కూడా వినండి: ప్రియాంక

ABN, First Publish Date - 2020-04-05T00:15:36+05:30

ఆదివారం రాత్రి దేశ వ్యాప్తంగా విద్యుద్దీపాలు ఆర్పివేసి, దివ్వెలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి దేశ వ్యాప్తంగా విద్యుద్దీపాలు ఆర్పివేసి, దివ్వెలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనా వైరస్‌పై దేశం యావత్తూ ఒక్కటిగా నిలిచి పోరాడుతున్న వేళ విద్యుత్ సరఫరాపై ప్రభావం పడేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆమె విమర్శించారు. ‘‘కరోనా వైరస్‌పై పోరాడేందుకు దేశమంతా ఒక్కటిగా నిలుస్తున్న వేళ... పవర్ గ్రిడ్స్, ఇంజినీర్ల ఆందోళనను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సంక్షోభ సమయంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి..’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ఓ వార్తా కథనాన్ని కూడా జోడించారు. కరోనా చీకటిని తరిమికొట్టేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు విద్యుత్ లైట్లు ఆర్పివేసి... దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించాలంటూ  ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 



Updated Date - 2020-04-05T00:15:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising