ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్భయ దోషుల ఉరిశిక్ష స్టేను సవాల్ చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2020-02-03T01:23:10+05:30

నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను కేంద్రప్రభుత్వం సవాల్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్భయ హత్యాచారం కేసులో దోషుల ఉరిశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను కేంద్రప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. కేంద్రం తరఫున సొలిసిటర్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడానికి అనుమతినివ్వాలని ఆయన కోరారు. న్యాయవ్యవస్థలోని అంశాలను ఒకరి తర్వాత ఒకరుగా ఉపయోగించుకొంటున్న దోషులు కావాలనే శిక్ష అమలు కాకుండా జాప్యం జరిగేలా చేస్తున్నారని ఆయన అన్నారు.

ఈ విషయంలో చట్టం దుర్వినియోగం అవుతోందని, ఇలాగైతే ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం పోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. క్షమాభిక్ష తిరస్కరణకు గురైన దోషులిద్దరికీ వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని కోరారు. కాగా, ఎప్పట్లాగే నిందితుల తరపున ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. గత సుప్రీం తీర్పు, జైలు మాన్యువల్ ప్రకారం వీరికి ఉరి వేయడానికి వీల్లేదని ఆయన వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారని, కోర్టు తీర్పుతో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-02-03T01:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising