ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంగళూరులో ఎన్ఐఏ కార్యాలయం: తేజస్వి సూర్య

ABN, First Publish Date - 2020-09-28T01:28:54+05:30

జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు కళ్లెం వేసేందుకు బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ,,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే సంస్థలకు కళ్లెం వేసేందుకు బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయం ఏర్పాటు కానుందని, ఇందుకు కేంద్రం అంగీకరించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను తాను కలసి బెంగళూరులో పూర్తిస్థాయిలో ఎన్ఐఏ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశానని, అందుకు ఆయన అంగీకరించారని తెలిపారు. 


'పలు టెర్రర్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్ బెంగుళూరులో బయటపడ్డాయి. ఎన్ఐఏ శాశ్వాత కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కళ్లెం వేయవచ్చని హోం మంత్రికి చెప్పాను. త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు' అని తేజస్వి సూర్య తెలిపారు. ఆగస్టు 11న ఈస్ట్ బెంగళూరులో చోటుచేసుకున్న హింసాకాండపై మాట్లాడుతూ, పోలీసు స్టేషన్లపై జరిగిన దాడికి సంబంధించి కీలక కుట్రదారులను ఎన్ఐఏ అరెస్టు చేసిందని చెప్పారు. హింసాకాండ అప్పటికప్పుడు జరిగింది కాదని, కుట్ర కోణం ఉందనే విషయం ఈ ఘటనతో వెలుగుచూసిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-28T01:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising