ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం తీపికబురు.. వరల్డ్ బ్యాంకుతో రూ.5,600 కోట్ల ఒప్పందం

ABN, First Publish Date - 2020-07-07T00:24:07+05:30

ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ తిపికబురు అందించింది. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం ఓ తిపికబురు అందించింది. కరోనాతో తీవ్రంగా నష్టపోతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఈ మేరకు నేడు ప్రపంచ బ్యాంకుతో రూ.5,600 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా దాదాపు 15 లక్షల మంది చిరు వ్యాపారులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది. సత్వర రుణ సౌకర్యం కల్పించడంతో పాటు, వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు చేయూతనందిండమే ఈ ఒప్పందం లక్షం. ఇదిలా ఉంటే ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఇది తొలిఅడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన అనేకమందికి తిరిగి ఉపాధి పొందేందుకు, మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపుడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ ఒప్పందంపై భారత ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ సమీర్ కుమార్ ఖేర్ సంతకం చేశారు. ప్రపంచ బ్యాంకులోని భారత్ తరపు ప్రతినిధి జునైద్ అహ్మద్ తరపున ఆయన ఈ సంతకం చేశారు. ఈ సందర్బంగా ఖేర్ మాట్లాడుతూ, కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధిని పునరుద్ధరించేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 

Updated Date - 2020-07-07T00:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising