ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలీగఢ్ జైల్లో హత్రాస్ నిందితులను విచారించిన సీబీఐ

ABN, First Publish Date - 2020-10-20T04:56:52+05:30

యూపీలోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: యూపీలోని హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా అలీగఢ్ జైల్లో ఉన్న నిందితులు సందీప్, లవ్‌కుశ్, రవి, రాములను ప్రశ్నించేందుకు సీబీఐ బృందం కోర్టు అనుమతి తీసుకుంది. గత నెల 14న సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలికి తొలుత చికిత్స అందించిన జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తీవ్ర గాయాలపాలైన బాధిత యువతి ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. అదే రోజుల రాత్రి కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా బాధితురాలి మృత దేహానికి జిల్లా అధికారులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. అధికారుల తీరుపై అలహాబాద్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారం యూపీలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. సీబీఐ అధికారులు ఇప్పటికే హత్రాస్ బాధిత కుటుంబం నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. 

Updated Date - 2020-10-20T04:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising