ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఐదుగురు పోలీసులను మా కస్టడీకి ఇవ్వండి: సీబీఐ పిటిషన్

ABN, First Publish Date - 2020-07-14T03:15:10+05:30

తమిళనాడులోని టుటికోరిన్‌లో తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసును విచారిస్తున్న సీబీఐ.. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధురై: తమిళనాడు తండ్రీకొడుకుల లాకప్‌డెత్ కేసును విచారిస్తున్న సీబీఐ.. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు పోలీసులను తమ కస్టడీకి అప్పగించాలంటూ స్థానిక జిల్లాకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నిందితులను రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాలంటూ జిల్లా, సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి హేమంత్ కుమార్ పోలీసులను ఆదేశించారు. ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు రఘు గణేశ్, బాలకృష్ణన్ సహా ఈ కేసులోని ఐదుగురు నిందితులను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ తన పిటిషన్‌లో కోరింది. గత నెలలో టుటికోరిన్‌‌కి చెందిన ఓ షాపు యజమాని పి. జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌లు పోలీసు కస్టడీలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే వారిద్దరూ చనిపోయినట్టు ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-07-14T03:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising