ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పాజిటివ్ కేసులు పెరగవచ్చు: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2020-04-05T00:00:29+05:30

మర్కజ్ నుంచి 2,300 మందిని బయటకు తీసుకువచ్చామని, కరోనా లక్షణాలున్న 500 మందిని ఆసుపత్రులలో చేర్చామని ముఖ్యమంత్రి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా పాజిటివ్ కేసులు ఢిల్లీలో మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, మర్కజ్ నుంచి 2,300 మందిని బయటకు తీసుకువచ్చామని, కరోనా లక్షణాలున్న 500 మందిని ఆసుపత్రులలో చేర్చామని చెప్పారు. తక్కిన 1,800 మందిని క్వారంటెన్‌లో ఉంచామని తెలిపారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, రెండు లేదా మూడు రోజుల్లో ఆ పరీక్షా ఫలితాలు వస్తాయని వివిరించారు. దానిని బట్టి కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని ఆయన పేర్కొన్నారు.


ఢిల్లీలోని ఐసీయూలో 11 మంది కరోనా వైరస్ పేషెంట్లు ఉన్నారని, ఐదుగురికి వెంటిలేటర్లపై చికిత్స అందిస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఆరుగురికి చేరిందని చెప్పారు. వీరిలో ఐదుగురు 60 ఏళ్లకు పైబడిన వారేనని అన్నారు. వయోవృద్ధులు వైరస్ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నందున వారంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కేజ్రీవాల్ కోరారు.

Updated Date - 2020-04-05T00:00:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising