ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులను తరలిస్తే బస్సు సిబ్బందిపై క్రిమినల్ కేసులు

ABN, First Publish Date - 2020-03-30T16:35:30+05:30

లాక్‌డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రయాణికులను తరలించే బస్సులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రయాణికులను తరలిస్తున్న బస్సులపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అధికారుల అనుమతి తీసుకోకుండా ప్రయాణికులను తరలిస్తే బస్సు సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. అంతర్రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నామనీ.. మినహాయింపు ఉన్న వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలను తిరగనివ్వబోమని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ‘‘డీటీసీ బస్సులు సహా ఇతర అన్ని బస్సుల్లోనూ ప్రభుత్వ అనుమతి పత్రం లేకుండా ఏ ప్రయాణికుడినీ తీసుకెళ్లడానికి వీల్లేదు. అనుమతి లేకుండా ఎవరినైనా తరలించినట్టు తేలితే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం...’’ అని చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్ది గంటల్లోనే సెంట్రల్ ఢిల్లీలో ప్రయాణికులను తరలిస్తున్న ఓ బస్సు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సరైన కారణం లేదా అధికారిక పాస్ లేకుండా బయటికి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ‘‘రీజనింగ్, లాజిక్కులు, తెలివితేటలు ప్రదర్శించడం’’ చేయకుండా ప్రభుత్వ ఆదేశాలకు శిరసా వహించాలని కోరారు. 

Updated Date - 2020-03-30T16:35:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising