ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు అక్రమ చొరబాటుదారుల్ని కాల్చి చంపిన భారత సైన్యం

ABN, First Publish Date - 2020-08-22T17:16:19+05:30

పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు అక్రమ చొరబాటుదారుల్ని భారత సైన్యం శనివారం కాల్చి చంపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు అక్రమ చొరబాటుదారుల్ని భారత సైన్యం శనివారం కాల్చి చంపింది. పంజాబ్ జిల్లాలోని తర్నాతరణ్‌ ప్రాంతం నుంచి ఈ ఐదుగురూ అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని గమనించిన భారత జవాన్లు ఈ అక్రమ చొరబాటు దార్లను కాల్చి చంపేశారు. ఈ ఐదుగురూ పాక్ తీవ్రవాదులేనని అధికారులు పేర్కొన్నారు.


అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించే క్రమంలో లొంగిపోవాలని తాము కోరామని, అయినా సరే ఆ అక్రమ చొరబాటు దారులు వినకపోవడంతో వారిపై కాల్పులు ప్రారంభించామని, ఐదుగురు మరణించారని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి ఏకె -47తో పాటు ఆయుధాలతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు బీఎస్‌ఎఫ్ ప్రకటించింది. ఈ ఘటనతో సరిహద్దుల వెంబడి ఆర్మీ మరింత నిఘాను పెంచింది. 


దీని కంటే కొద్ది రోజుల ముందు కూడా అచ్చు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. గుజరాత్ -రాజస్థాన్ సరిహద్దుల గుండా భారత్‌లోకి ప్రవేశించాలని అక్రమ చొరబాటుదార్లు ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన జవాన్లు వారిని కాల్చి చంపారు. 

Updated Date - 2020-08-22T17:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising