ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది..ప్రమాద హెచ్చరిక జారీ

ABN, First Publish Date - 2020-06-25T14:51:55+05:30

అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి మరీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి మరీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. అసోంలోని గువాహటి నగరం వద్ద వద్ద బ్రహ్మపుత్ర నదీ నీటి మట్టం డేంజర్‌ మార్క్‌ను దాటింది. వర్షాకాలం ప్రారంభం నుంచి అసోం రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తుండటంతో బ్రహ్మపుత్ర నదిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. బ్రహ్మపుత్ర నది నీటిమట్టం 49.09 మీటర్లు దాటడంతో బుధవారమే ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, గురువారం ప్రమాదస్థాయి కంటే ఒక మీటరు ఎత్తులో వరదనీరు ప్రవహిస్తుందని కేంద్ర జలవనరుల కమిషన్ అధికారి సాజిదుల్ హఖ్  చెప్పారు. బీహార్, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్ సబ్ హిమాలయన్ ప్రాంతాల్లో ఈ నెల 25 నుంచి 27వతేదీ వరకు భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. భారీవర్షాల వల్ల వరదముప్పు పెరిగి పలు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదముంది. 

Updated Date - 2020-06-25T14:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising