ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే ‘బ్లూ మూన్’.. మళ్ళీ చూడాలంటే...

ABN, First Publish Date - 2020-10-30T23:54:23+05:30

ఒకే నెలలో రెండుసార్లు ‘పౌర్ణమి’ వచ్చిన సందర్భాల్లో ‘బ్లూ మూన్’ సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే క్రమంలో... భారతదేశంలో శనివారం ‘బ్లూ మూన్’ సంభవించబోతోందని వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఒకే నెలలో రెండుసార్లు ‘పౌర్ణమి’ వచ్చిన సందర్భాల్లో ‘బ్లూ మూన్’ సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇదే క్రమంలో... భారతదేశంలో శనివారం ‘బ్లూ మూన్’ సంభవించబోతోందని వెల్లడించారు. శనివారం శరద్ పూర్ణమ మాత్రమే కాదు... హాలోవీన్(క్రైస్తవుల పండుగ) కూడా ఉంది. ఇక బ్లూ మూన్ అన్నది ఖగోళ ఘటన. రెండు, మూడు సంవత్సరాలకోమారు వస్తుంది. అయితే... శనివారం జరగనున్న బ్లూ మూన్ ను మళ్ళీ చూడగలిగేది 2039 లోనేనని శస్త్రజ్ఞులు చెబుతున్నారు. శనివారం రాత్రి 8.19 గంటలకు బ్లూ మూన్ సంభవించనుంది. 


వాస్తవానికి బ్లూ మూన్ అంటే... చంద్రుడు నీలం రంగులో కనబడతాడని కాదు. ఒకే నెలలో చోటుచేసుకునే రెండు పౌర్ణమిల నేపధ్యంలో రెండవ పౌర్ణమిని ‘బ్లూ మూన్’గా వ్యవహరిస్తారు. కాగా ఈ దఫా సంభవించనున్న బ్లూ మూన్ కూడా సాధారణంగా కనబడే పసుపు, తెలుపు రంగుల్లో కాకుండా భిన్నంగా కనిపిస్తుంది. ఈ దఫా బ్లూ మూన్ కు ఇదో ప్రత్యేకత అని శాస్తజ్ఞులు చెబుతున్నారు. 

Updated Date - 2020-10-30T23:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising