ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు బీకేయూ

ABN, First Publish Date - 2020-12-11T21:36:49+05:30

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ-భాను) నూతన వ్యవసాయ చట్టాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ-భాను) నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాలు అమలైతే కార్పొరేట్ సంస్థల దురాశకు తాము బాధితులుగా మారిపోతామని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంటర్వెన్షన్ అప్లికేషన్ దాఖలు చేసింది.


ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్; ఫార్మర్స్ ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్‌మెంట్ యాక్ట్‌లను రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14న దేశవ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో రైతు సంఘాల చర్చలు విఫలమయ్యాయి. రైతుల ఆందోళనను అర్థం చేసుకుని ఈ చట్టాల్లో కొన్ని సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రైతులతో చర్చలు కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి తోమర్ చెప్పారు. 


ఈ చట్టాలు చట్టవిరుద్ధమని, నిరంకుశత్వంతో చేసినవని, వ్యవసాయోత్పత్తుల వ్యాపారీకరణ, ధరల పెరుగుదలకు బాటలు పరుస్తాయని భాను ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని  బీకేయూ-భాను తన పిటిషన్‌లో ఆరోపించింది.  ఈ చట్టాలు అమలైతే దేశం నాశనమవుతుందని, కరువు కాటకాలు వచ్చే ప్రమాదం ఉందని, ఒకేసారి ఎటువంటి నియంత్రణలు లేకుండా వ్యవసాయోత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తారని పేర్కొంది. వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన ధరలకు హామీ ఇస్తున్న అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల వ్యవస్థ ధ్వంసమవుతుందని తెలిపింది. కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడవలసిన పరిస్థితి ఎదురవుతుందని పేర్కొంది. 


లాభార్జనే ధ్యేయంగా పని చేసే కార్పొరేట్ సంస్థలు పేద రైతుల పరిస్థితులను పట్టించుకోవని ఆరోపించింది. చాలా మంది రైతులు నిరక్షరాస్యులైనందువల్ల ప్రైవేటు కంపెనీలతో చర్చలు జరపే సామర్థ్యం ఉండదని, బేరమాడటంలో అసమానతలు తలెత్తుతాయని తెలిపింది. వ్యవసాయోత్పత్తుల ధరల నిర్ణయం కోసం రైతు కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. ఈ కమిటీలో అధ్యక్షుడితో సహా సభ్యులంతా కచ్చితంగా నిజమైన రైతులే ఉండాలని పేర్కొంది. 


Updated Date - 2020-12-11T21:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising