ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను బానిసలుగా చూడాలనుకుంటున్నారు : డీకే శివకుమార్

ABN, First Publish Date - 2020-09-26T23:21:01+05:30

కర్నాటక అసెంబ్లీలో గలాటా జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ అసెంబ్లీ నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీలో గలాటా జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. బిల్లు ప్రతులను చించేస్తూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ... వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. రైతులను బానిసలుగా మార్చడానికే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని ఆరోపించారు.


‘‘రైతుల భూములను తీసుకున్నారు. కేంద్రం తెచ్చిన సవరణలు బాగోలేవు. రైతుల నుంచి భూములు తీసుకోడానికి సవరణలు చేశారు. రైతులను బానిసలు చేయాలని అనుకుంటున్నారు. అందుకే ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాం’’ అని డీకే శివకుమార్ ప్రకటించారు. ఈ బిల్లులపై గవర్నర్ సంతకం చేయకూడదని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం కాంగ్రెస్ పక్షాన పోరాడుతున్నామని, ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

కేవలం రెండు శాతం భూమే తీసుకుంటున్నాం : సీఎం యడియూరప్ప

కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి యడియూరప్ప స్పందించారు. ‘‘కేవలం రెండు శాతం భూమినే పరిశ్రమల కోసం తీసుకుంటాం అని మళ్లీ మళ్లీ చెబుతున్నా. సాగు భూములను రైతులు సాగుకే వాడుకోవచ్చు. అదో నిబంధన. రైతులకు ఎలాంటి ఇ్బంది లేదు. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని సీఎం యడియూరప్ప తెలిపారు. 

Updated Date - 2020-09-26T23:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising