ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలి: బీజేపీ నేత

ABN, First Publish Date - 2020-07-11T15:32:35+05:30

కరోనా వైరస్‌ బారినపడే మంత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ సూచించారు. నగరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కరోనా వైరస్‌ బారినపడే మంత్రులు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ సూచించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమెరికా వంటి దేశాల్లోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయ లేకున్నారని, అయితే మన దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉంద న్నారు. అలాగే, లాక్‌డౌన్‌ కాలంలో అన్నివర్గాల ప్రజలు నష్టపోకుండా ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేసిన ‘సన్మాన్‌ నిధి’ పథకంలో రాష్ట్రంలో 35 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు. ‘జన్‌ధన్‌’ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు కోటి మంది మహిళలకు నెలకు రూ.500 చెల్లిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ కాలంలో పేదల ఆకలి తీర్చేలా నవంబరు వరకు రేషన్‌ దుకాణాల్లో ఒకరికి అదనంగా ఐదు కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తుందన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం అందించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లులు అధికంగా వస్తున్నాయనే ఫిర్యాదులపై రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కరోనా బాధి తులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా రేయింబవళ్లూ శ్రమిస్తున్నారని అభి నందించారు. ప్రభుత్వాస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన చికిత్స జరుగుతోందని, మంత్రులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స కోసం ముందుకు రావాలన్నారు. లాక్‌ డౌన్‌ సమయంలో బీజేపీ ఆధ్వర్యంలో కోటి మందికి ఆహారం, 35 లక్షల మందికి నిత్యావసర సరుకులను అందజేశామన్నారు. ఇప్పటివరకు 45 లక్షల మాస్క్‌లు పంపిణీ చేయగా మరో కోటి మాస్క్‌లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కేరళలో ఇటీవల జరిగిన సంఘటనపై విచారణ జరిపి వాస్తవాలు తెలియజేయాలని, ఆ రాష్ట్ర సీఎం తన పదవికి రాజీనామా చేసి విచారణకు సహకరించాలని మురుగన్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-07-11T15:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising