130 కోట్ల మందిని ప్రమాదంలో పడేశారు: కాంగ్రెస్
ABN, First Publish Date - 2020-03-27T19:49:39+05:30
కరోనా వైరస్ చెలరేగిన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంలో కేంద్రం జాప్యం చేసిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని..
భోపాల్: కరోనా వైరస్ చెలరేగిన సమయంలో లాక్‌డౌన్ ప్రకటించడంలో కేంద్రం జాప్యం చేసిందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం, ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ తలమునకలై 130 కోట్ల మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిందని విమర్శించింది.
దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీని తప్పుపట్టలేమని, కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చి, శివరాజ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఒక కార్యక్రమంగా పెట్టుకున్న బీజేపీదే ఈ తప్పిదమని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మధ్యప్రదేశ్ కరోనావైరస్ గుప్పిట్లో ఉందని, శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం, కరోనా వైరస్‌తో తలెత్తిన అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన ప్రణాళిక లేకపోవడం శోఛనీయమని పేర్కొంది. 'ఎంపీలంతా కరోనా భయంలో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో చూస్తే కేబినెట్ లేదు, కాబినెట్ కమిటీ లేదు, ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఇతమిత్థమైన ప్రణాళిక కానీ లేదు. శివరాజ్ కలెక్టర్లను నమ్మరు, ప్రభుత్వం కూడా ఎంతోకాలం మనుగడ సాగించదు' అని కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ మరో ట్వీట్‌లో పేర్కొంది.
Updated Date - 2020-03-27T19:49:39+05:30 IST