ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరాఠా రిజర్వేషన్ కోసం బీజేపీ ఆందోళన

ABN, First Publish Date - 2020-12-16T02:21:31+05:30

మరాఠా రిజర్వేషన్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇవాళ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మరాఠా రిజర్వేషన్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇవాళ శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రభుత్వం ప్రశ్నల నుంచి తప్పించుకు తిరుగుతోంది. ఆజాద్ మైదానంలో విద్యార్ధులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మాకు కనీసం అవకాశం ఇవ్వడం లేదు. అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం..’’ అని పేర్కొన్నారు. అంతకు ముందు మరాఠా రిజర్వేషన్‌, మహిళా భద్రత సహా పలు సమస్యలపై అసెంబ్లీ వెలుపల బీజేపీ ధర్నా చేపట్టింది. బలమైన ప్రతిపక్షాన్ని, చర్చను ఎదుర్కోలేకనే ప్రభుత్వం పారిపోతోందని మహారాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ ఎద్దేవా చేశారు. ‘‘మరాఠా రిజర్వేషన్ గురించి మహారాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనికోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో శక్తిమేర ప్రయత్నించాలి. అదే సమయంలో ఓబీసీ రిజర్వేషన్లు కూడా చెక్కుచెదరకుండా, యధాతథంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-16T02:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising