ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవికిషన్‌కు మద్దతునిస్తూ, జయా బచ్చన్‌కు ఛాలెంజ్ చేసిన జయప్రద

ABN, First Publish Date - 2020-09-17T13:29:11+05:30

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన నేపధ్యంలో బాలీవుడ్ నటుల మధ్య కలకలం చెలరేగింది. డ్రగ్స్ వినియోగం విషయమై పార్లమెంటులో వాదనలు చోటుచేసుకున్న అనంతరం బీజేపీ నేత, నటి జయప్రద...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన నేపధ్యంలో బాలీవుడ్ నటుల మధ్య కలకలం చెలరేగింది. డ్రగ్స్ వినియోగం విషయమై పార్లమెంటులో వాదనలు చోటుచేసుకున్న అనంతరం బీజేపీ నేత, నటి జయప్రద తన గళం విప్పారు. పార్లమెంటులో ఎంపీలు రవికిషన్, జయాబచ్చన్‌ల మధ్య జరిగిన వాదప్రతివాదనల్లో రవికిషన్‌కు జయప్రద మద్దతు పలికారు. జయప్రద ఎంపీ జయా బచ్చన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ జయా వాదన సరైనది కాదని తనకు అనిపిస్తున్నదన్నారు.



బచ్చన్ కుటుంబం ఏది చెప్పినా దానిని వినేందుకు ప్రపంచం సిద్ధంగా ఉంటుంది. అందుకే నేను వారికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు (బచ్చన్ కుటుంబం) ఈ డ్రగ్ మాఫియాను, డ్రగ్ ఎడిక్టెడ్ యువతను నియంత్రించగలరా? అని ప్రశ్నించారు. ఇంతేకాదు జయా బచ్చన్ ఈ డ్రగ్స్ ఉదంతాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జయా బచ్చన్ అభిప్రాయాలను గౌరవిస్తానని, కానీ ఆమె భావజాలంలో కేవలం రాజనీతి కోణమే కనిపిస్తున్నదన్నారు. బచ్చన్ కుటుంబం సమస్యల్లో ఉన్నప్పుడు అమర్‌సింగ్ వారికి అండగా నిలిచారన్నారు. అయితే అమర్‌సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జయా బచ్చన్ స్పందన విచిత్రంగా అనిపించిందన్నారు. సుశాంత్ సింగ్ మృతి అనంతరం సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై చర్చ జరుగుతోందన్నారు.


పంజాబ్ మొదలుకొని నేపాల్ వరకూ డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నదన్నారు. డ్రగ్స్ కారణంగా యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నదన్నారు. డ్రగ్స్ వ్యవహారం ఏ రంగంలో ఉన్నా, దానిని తరిమికొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. కాగా పార్లమెంటులో ఎంపీ రవికిషన్ భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యసనం ఎక్కువేనని వ్యాఖ్యానించారు. ఈ ఉదంతంలో చాలామంది పట్టబడ్డారన్నారు. ఎన్సీబీ మంచిపని చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఈ ఉదంతంలో మరింతగా దృష్టిసారించి, నిందితులకు తగిన శిక్ష విధించాలని కోరారు. అనంతరం జయా బచ్చన్ మాట్లాడుతూ ఒక ఎంపీ  బాలీవుడ్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని, ఇది సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-17T13:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising