ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైలెట్‌పై తమ వైఖరి వెల్లడించిన బీజేపీ

ABN, First Publish Date - 2020-07-14T19:09:50+05:30

బీజేపీతో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ పార్టీ నుంచి అధికారికంగా ఆహ్వానం రావడం ఇదే తొలిసారి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ కోసం భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ నేత ఓం మథుర్ ప్రకటించారు. కాంగ్రెస్ కనుక సచిన్ పైలెట్ సహా ఆయన వర్గంపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే వారిని బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీతో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ పార్టీ నుంచి అధికారికంగా ఆహ్వానం రావడం ఇదే తొలిసారి.


‘‘సచిన్ పైలెట్‌కు మా తలుపులు తెరిచే ఉంటాయి. బీజేపీలోకి ఎవరైనా రావొచ్చు. పార్టీలోకి వచ్చిన వారు పార్టీ సిద్ధాంతాల్ని అవర్చుకునే వారికి మేం స్వాగతం పలుకుతాం. బీజేపీ దేశంలోనే పెద్ద పార్టీ. అది కేవలం నంబర్లకే పరిమితం కాదు. ప్రజలు నిరూపించారు’’ అని ఓం మథుర్ అన్నారు. ఇక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ చెబుతున్నట్లు కాంగ్రెస్ వద్ద సంపూర్ణ మెజారిటీ ఉన్నట్లైతే అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం కావాలని సవాల్ మథుర్ విసిరారు. 

Updated Date - 2020-07-14T19:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising