ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒబామా వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ స్పందన

ABN, First Publish Date - 2020-11-13T20:43:12+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘రాహుల్, ఒబామా మధ్య భేటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘రాహుల్, ఒబామా మధ్య భేటీ పదేళ్ల క్రితం జరిగింది. అది కూడా చాలా తక్కువ సమయమే చర్చించారు. అతి తక్కువ భేటీలతోనే ఓ వ్యక్తిని అంచనా వేయడం చాలా కష్టం. అప్పటి కంటే ఇప్పుడు రాహుల్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. చాలా అనుభవాన్ని కూడా సంపాదించారు.’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తారీఖ్ అన్వర్ తెలిపారు. ఇక కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ... ‘‘ఎవరి మూర్ఖత్వం గురించైనా అంతర్జాతీయంగా తెలిసిందంటే... ప్రస్తుత రోజుల్లో అది ప్రపంచమంతటికీ పాకిపోతుంది. ప్రస్తుతానికి ఇంత మాత్రమే చెప్పగలను.’’ అంటూ నఖ్వీ ఎద్దేవా చేశారు. బీజేపీ అగ్రనేత గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ... ‘‘సాక్షాత్తూ ఒబామాయే రాహుల్ గురించి వ్యాఖ్యానించారంటే ఇక రాహుల్ గురించి చర్చించాల్సిన అవసరమే లేదు.’’ అని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. 


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన కొత్త పుస్తకం 'A Promised Land'లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. న్యూయార్క్ టైమ్స్ సమీక్షించిన ఈ పుస్తకంలో... ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల గురించి ఒబామా తన అభిప్రాయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ పుస్తకంలో రాహుల్ గురించి ప్రస్తావించిన ఒబామా..."రాహుల్ గాంధీకి ఒక బలహీనమైన అలవాటు ఉంది. అతను కోర్సు మొత్తం పూర్తి చేసి, టీచర్‌ను ఆకట్టుకోవాలని ఎదురుచూస్తుంటాడు. కానీ, లోతుగా విషయం నేర్చుకునేందుకు అవసరమైన అభిరుచి గానీ, అసక్తి గానీ ఉండవు." అని అన్నారు. అలాగే సోనియా గాంధీపై కూడా ఈ పుస్తకంలో ఒబామా మాట్లాడారు. 


"చార్లీ క్రిస్ట్, రహమ్ ఇమాన్యుయేల్ వంటి పురుషుల అందం గురించి మనకు చెప్పబడింది. కానీ మహిళల అందం గురించి చెప్పలేదు. ఒకటి.. రెండు.. సందర్భాల్లో మినహా సోనియా గాంధీ విషయంలో కూడా అదే జరిగింది." అని చెప్పారు. ఇక అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా 2010, 2015లో రెండుసార్లు భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్‌తో ఒబామా భేటీ కూడా అయ్యారు.  

Updated Date - 2020-11-13T20:43:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising