నడ్డా అధ్యక్షతన బిహార్ వ్యూహ బృందం సమావేశం
ABN, First Publish Date - 2020-08-22T15:31:20+05:30
బిహార్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహ రచన నిమిత్తమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో
న్యూఢిల్లీ : బిహార్ ఎన్నికల నేపథ్యంలో వ్యూహ రచన నిమిత్తమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వంలో వ్యూహ రచన బృందం సమావేశం కానుంది. వర్చువల్ మీటింగ్ ద్వారా వ్యూహ రచనను, కార్యాచరణను చర్చించనున్నారు. బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శి బి.ఎల్. సంతోశ్, ఎంపీ భూపేంద్ర యాదవ్, బిహార్ ఎన్నికల ఇన్‌చార్జీ దేవేంద్ర ఫడణ్‌వీస్, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ హాజరుకానున్నారు.
ఈ కార్యవర్గ సమావేశం చాలా కీలకమైందని, రాష్ట్రంలోని 76 లక్షల మంది శ్రేణులకు కార్యాచరణను సిద్ధం చేయనున్నామని బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు జైస్వాల్ తెలిపారు. మొదటి రోజు సమావేశం అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో ప్రారంభమవుతుందని, ఆదివారం సాయంత్రం నడ్డా ముగింపు పలుకులతో సమావేశం పూర్తవుతుందని జైస్వాల్ తెలిపారు.
Updated Date - 2020-08-22T15:31:20+05:30 IST