ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్యేకు నడ్డా వార్నింగ్

ABN, First Publish Date - 2020-10-19T18:43:48+05:30

బల్లియాలో పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన విషయంలో బీజేపీ ఎమ్మెల్యేకి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : బల్లియాలో పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన విషయంలో బీజేపీ ఎమ్మెల్యేకి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత వారం యూపీలోని బల్లియాలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుచరుడు పోలీసుల ఎదుటే ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. ఈ విషయంలో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుచరుడికే మద్దతు పలికారు. దీంతో రాష్ట్రంలో, పార్టీలో తీవ్ర దుమారం రేగింది. వీటన్నింటినీ గమనించిన అధిష్ఠానం... రంగంలోకి దిగింది. ఈ సంఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని సురేంద్ర సింగ్‌కు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుణ్ని నడ్డా ఆదేశించారు.


అంతేకాకుండా విచారణకు దూరంగా ఉండాలని ఆదేశించారు.  అంతేకాకుండా ఎమ్మెల్యే తీరుపై నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జాతీయ అధ్యక్షుడు నడ్డా యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ తో మాట్లాడారు. బల్లియా సంఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సింగ్ చేసిన ప్రకటనలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్లియా విచారణకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేకు సూచించాలని నడ్డా ఆదేశించారు.’’ అని యూపీ బీజేపీ ప్రకటించింది. 


Updated Date - 2020-10-19T18:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising