ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ భరోసా పథకంలోకి 165 దేశాలు

ABN, First Publish Date - 2020-07-16T07:39:43+05:30

కరోనా వ్యాక్సిన్‌ మూడు ప్రయోగదశలను దాటకముందే.. అమెరికా, బ్రిటన్‌ వంటి ధనిక దేశాలు ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వ్యాక్సిన్‌ విజయవంతమైందని తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది ?...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బిల్‌, మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన జీఏవీఐ సంస్థ చొరవ 


లండన్‌, జూలై 15: కరోనా వ్యాక్సిన్‌ మూడు ప్రయోగదశలను దాటకముందే.. అమెరికా, బ్రిటన్‌ వంటి ధనిక దేశాలు ఆర్డర్లు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వ్యాక్సిన్‌ విజయవంతమైందని తెలిస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుంది ? పేద దేశాలు కొనేందుకు మిగలకుండా వ్యాక్సిన్లను ధనిక దేశాలు రిజర్వ్‌ చేసుకున్నా ఆశ్చ ర్యం లేదు. ఈ నేపథ్యంలో అల్పాదాయ దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందుతుందనే భరోసా ఇచ్చేందుకు బిల్‌, మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌కు చెందిన గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్స్‌ (జీఏవీఐ) ప్రారంభించిన ‘కోవ్యాక్స్‌ అడ్వాన్స్‌డ్‌ మార్కె ట్‌ కమిట్‌మెంట్‌’ పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిలో చేరేందుకు 75 ధనిక దేశాలు కూడా అంగీకారం తెలిపాయని జీఏవీఐ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.


దాతల నుంచి సేకరించే విరాళాలను జీఏవీఐకి అందించడం ద్వారా 90 అల్పాదాయ దేశాలకు కరోనా వ్యాక్సిన్లను సమకూర్చేందుకు సహాయపడతాయని ధనిక దే శాలు హామీ ఇచ్చాయని పేర్కొంది. దీంతో జీఏవీఐలో చేరిన దేశాల సంఖ్య 165కు చే రిందని వెల్లడించింది.  సభ్యదేశాలన్నింటికి వాటి జనాభాలో 20 శాతానికి సరిపడా వ్యాక్సిన్‌ డోసులను జీఏవీఐ అందించనుంది. 


Updated Date - 2020-07-16T07:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising