దేశమంతా కరోనా భయంలో ఉంటే.. అబ్బాయిని ఎత్తుకెళ్లి పెళ్లి చేశారు!
ABN, First Publish Date - 2020-03-28T00:51:52+05:30
దేశమంతా లాక్‌డౌన్ నడుస్తోంది. కరోనా భయంతో ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమవుతున్నారు. ఇంత ఆందోళనకర సమయంలోనూ....
హాజీపూర్: దేశమంతా లాక్‌డౌన్ నడుస్తోంది. కరోనా భయంతో ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితమవుతున్నారు. ఇంత ఆందోళనకర సమయంలోనూ బీహార్‌లోని హాజీపూర్‌లో ఓ యువకుడిని ఎత్తుకెళ్లి బలవంతంగా వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నౌరంగ్‌పూర్‌లోని మహనార పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ముసఫీర్ రాయ్ కుమారుడిని కొంతమంది కిడ్నాప్ చేశారు. జందాహ్ హాస్పిటల్ సమీపంలో ఈ కిడ్నాప్ జరిగింది. అనంతరం వైశాలి జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీయడం విశేషం. ఇదంతా 10 నిమిషాల్లో జరిగిపోయింది. ఈ వీడియో ద్వారా అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదన్న విషయం తెలుస్తోంది. పెళ్లి జరుగుతున్న సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు వీడియోలో కనపడుతున్నాయి. తాను మెడికల్ షాపుకి వెళ్లిన సమయంలో తన కుమారుడిని కిడ్నాప్ చేసినట్టు ముసఫీర్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న జందాహ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఎత్తుకెళ్లి పెళ్లి జరిపించడాలు ఎక్కువగా పశ్చిమ బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో జరుగుతుంటాయి. భారీ కట్నాలు ఇచ్చుకోలేని వధువు తల్లిదండ్రులు అబ్బాయిలను ఎత్తుకొచ్చి ... పెళ్లి జరిపిస్తుంటారు.
Updated Date - 2020-03-28T00:51:52+05:30 IST