ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిహార్ ఎన్నికలు: 2015ను తలపిస్తున్న 2020

ABN, First Publish Date - 2020-10-28T23:49:12+05:30

2015తో పోల్చితే ఇదీ తక్కువ. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ కాస్త అటు ఇటుగా అదే ఓటింగ్ శాతం నమోదు అయ్యేట్లు కనిపిస్తోంది. మొదటి దశ పోలింగ్ కాస్త తక్కువే అయినప్పటికీ మిగిలిన రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: ఏ ఎన్నికలు జరిగినా బిహార్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతూ ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. కాకపొతే చాలా ఏళ్లు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ సారి కూడా పరిస్థితి అలాగే కనిపిస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతమే ఈ ఎన్నికల్లోనూ నమోదు కానుందా అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈరోజు మొదటి దశ పోలింగ్ ముగిసింది. అయితే పూర్తి పోలింగ్ శాతాన్ని ఈసీ ఇంకా ప్రకటించలేదు కానీ, సాయంత్రం 5 గంటల వరకు అయితే 51.8 శాతం పోలింగ్ నమోదైందని అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. చివరి గంటలో చెప్పుకోదగ్గ పోలింగ్ ఏమీ ఉండదు. మహా అయితే 0.5 శాతం నుంచి 2.0 శాతం పోలింగ్ నమోదు కావొచ్చు.


2015తో పోల్చితే ఇదీ తక్కువ. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 56.1 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లోనూ కాస్త అటు ఇటుగా అదే ఓటింగ్ శాతం నమోదు అయ్యేట్లు కనిపిస్తోంది. మొదటి దశ పోలింగ్ కాస్త తక్కువే అయినప్పటికీ మిగిలిన రెండు దశల్లో మరింత ఓటింగ్ నమోదు కావొచ్చు. ఎన్నికలకు ముందు బిహార్‌లో ఓటింగ్ శాతం పెరుగుతుందనే అంచనాలు కొన్ని వచ్చినప్పటికీ అవి వాస్తవం కాదని మొదటి దశ పోలింగ్ నిరూపించింది.

Updated Date - 2020-10-28T23:49:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising