ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్ లేకుండా ఓటు వేసేందుకు వచ్చి.... పోలీసులతో గొడవ!

ABN, First Publish Date - 2020-10-28T16:05:05+05:30

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈరోజు మొత్తం 71 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. బరిలో మొత్తం 1066 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు కరోనా గైడ్‌లైన్స్ పాటించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఓటర్లంతా మాస్కులు పెట్టుకుని పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. 


అయితే కొంతమంది ఓటర్లు మాస్క్ పెట్టుకోకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండటంతో అధికారులు వారికి అభ్యంతరం చెబుతున్నారు. దీంతో చిన్నపాటి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాసారామ్‌లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక ఓటరు ముఖానికి మాస్క్ పెట్టుకోకుండా వచ్చాడు. పోలీసులు మాస్క్ పెట్టుకోవాలని సూచించగా, ఆ వ్యక్తి గొడవకు దిగాడు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఆ వ్యక్తిని పోలీసులు మాస్క్ గురించి అడగగా...తాను మాస్క్ పెట్టుకునే బయటకు వచ్చానని, అయితే అది ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. దీంతో అతనికి... పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తరువాత పోలీసులే ఆ వ్యక్తికి మాస్క్ ఇవ్వాల్సివచ్చింది. 


Updated Date - 2020-10-28T16:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising