ఓటు వేసిన బీహార్ ఉపముఖ్యమంత్రి!
ABN, First Publish Date - 2020-11-03T13:32:40+05:30
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది.
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. మొత్తం 94 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. రెండవ దశ ఎన్నికల బరిలో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, ప్లూరల్స్ పార్టీ అధ్యక్షురాలు పుష్పం ప్రియా చౌదరితోపాటు తేజ్ ప్రతాప్ యాదవ్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ రోజు జరుగుతున్న రెండవ దశ పోలింగ్‌లో 2,86,11,164 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కాగా సీవాస్‌లోని జసౌలీ పంచాయతీలోని బూత్ నంబర్ 266లో ఈవీఎం మొరాయించడంతో 15 నిముషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమయ్యింది. అలాగే దర్బంగా, గోపాల్‌గంజ్‌లలోనూ ఈవీఎంలు మొరాయించాయి. తన సోదరుడు ప్రిన్స్ రాజ్‌తోపాటు చిరాగ్ పాశ్వాన్ కతార్‌లో క్యూలో నిలుచుని ఓటు వేశారు. దీనికి ముందు పాశ్వాన్... బీహార్ ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్వీట్ చేశారు. పట్నాలోని రాజేంద్రనగర్‌లో ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా ప్రోటోకాల్ పాటిస్తూ ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Updated Date - 2020-11-03T13:32:40+05:30 IST