బిహార్ సీఎం అభ్యర్థి నితీశ్!
ABN, First Publish Date - 2020-09-14T06:45:00+05:30
బిహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఉంటా రని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రకటించారు.
పొగడ్తలతో దాదాపుగా ప్రకటించేసిన మోదీ
పట్నా, సెప్టెంబరు 13: బిహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఉంటా రని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రకటించారు. ‘‘నయా భారత్, నవ బిహార్ నిర్మాణంలో నితీశ్ పాత్ర పెద్దది’’ అని మోదీ ప్రశంసించారు. బిహార్‌లో రూ.900 కోట్ల విలువైన 3 పెట్రోలియం ప్రాజెక్టులను ఆదివారం జాతికి అంకితం చేస్తూ చేసిన ప్రసంగంలో మోదీ ఈ మాటలన్నారు.
దీంతో రాష్ట్ర బీజేపీకి, మరో భాగస్వామ్య పక్షం లోక్ జనశక్తికి ఈ విషయమై వేరే చర్చ కు తావులేదని స్పష్టం చేసినట్లయింది. దీంతోపాటు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ హయాంపై ప్రధాని పరోక్ష విమర్శలు గుప్పించారు.
Updated Date - 2020-09-14T06:45:00+05:30 IST