ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ రోగులను చేర్చుకోని ప్రైవేటు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు: మంత్రి

ABN, First Publish Date - 2020-07-06T00:33:53+05:30

కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు నిరాకరించే బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్ రోగులను చేర్చుకునేందుకు నిరాకరించే బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కర్ణాటక వైద్యవిద్యాశాఖ మంత్రి కె.సుధాకర్ హెచ్చరించారు. బెంగళూరులో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో 3 వేల పడకలను రిజర్వు చేశారు. అలాగే, 10,100 పడకలతో దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 


బెంగళూరులోని 72 ప్రైవేటు ఆసుపత్రులలో 3,331 పడకలను రిజర్వు చేసినట్టు మంత్రి సుధాకర్ తెలిపారు. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను 10,100 పడకలతో కోవిడ్ సెంటర్‌గా మార్చినట్టు బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్  తెలిపారు. ఇందులో సరిపడా టాయిలెట్లు, నర్సింగ్ స్టేషన్లు, కిచెన్, ఇతర సదుపాయాలు ఉన్నట్టు పేర్కొన్నారు. 72 ప్రైవేటు ఆసుపత్రులలోని 3,331 పడకల్లో శనివారం సాయంత్రానికి 733 పడకలు నిండిపోగా, 2,598 పడకలు ఖాళీగా ఉన్నట్టు మంత్రి వివరించారు.  

Updated Date - 2020-07-06T00:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising