ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్-19: మమతా బెనర్జీని టార్గెట్ చేసిన బీజేపీ

ABN, First Publish Date - 2020-04-02T19:31:32+05:30

కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: కోవిడ్-19 లాక్‌డౌన్ సందర్భంగా ప్రజలకు నిత్యావసరాలను పంపిణీ చేసే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, ప్రతిపక్ష బీజేపీకి మధ్య చిచ్చురేగింది. ముఖ్యమంత్రి చేపట్టిన ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీకి పోటీగా బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. అయితే లాక్‌డౌన్ అమల్లో ఉందంటూ అక్కడి పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో.. వీరంతా ఇప్పుడు సీఎం మమతపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాము కూడా మమతా బెనర్జీని ‘‘స్ఫూర్తిగా’’ తీసుకుని నిత్యావసరాల పంపిణీ చేపట్టామనీ.. ఆమెలాగానే తాము ప్రజలకు సాయం చేస్తే తప్పేంటని బీజేపీ నేత సవ్యసాచి దత్తా ప్రశ్నించారు. తన సహాయ కార్యక్రమాలపై పోలీసులు, అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘పేద ప్రజలకు బియ్యం, పప్పు ధాన్యాలు మొదలైనవి పంపిణీ చేస్తుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇది లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమేనంటూ వెనక్కి పంపేస్తున్నారు...’’ అని ఆయన ఆరోపించారు. సాల్ట్ లేక్ మేయర్‌గా పనిచేసిన దత్తా గతేడాది అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు.


కాగా తనను కూడా నిత్యావసరాలు పంచిపెట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయాంతన్ బసు ఆరోపించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్, కేంద్రమంత్రి బాబూలాల్ సుప్రియో తదితరులు చేపట్టిన సహాయక కార్యక్రమాలకు అధికార యంత్రాంగం అడ్డుచెప్పకపోవడం విశేషం. ‘‘ముఖ్యమంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తే తప్పులేదుగానీ.. మేము అదే పనిచేస్తే లాక్‌డౌన్ ఉల్లంఘించినట్టా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు..’’ అని దిలీప్ ఘోష్ విమర్శించారు. అయితే ప్రతిపక్ష బీజేపీ నేతలు పదేపదే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని బెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హకీం ఆరోపించారు. ‘‘నిత్యావసరాలు పంచిపెట్టడానికి ఇదేనా సమయం? సహాయక సామగ్రిని పంచిపెట్టే పేరుతో జనాలను గుమిగూడేలా చేసి ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన లాక్‌డౌన్‌ను సైతం ఉల్లంఘిస్తున్నారు...’’ మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-02T19:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising