ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాటిలైట్లు, రాకెట్ల తయారీలోకి బీఈఎల్‌

ABN, First Publish Date - 2020-09-12T07:55:13+05:30

బెంగళూరు, సెప్టెంబరు 11: రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల తయారీలో భాగస్వామ్యమవుతున్న స్వదేశీ సంస్థల జాబితాలో భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) కూడా చేరనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 11: రక్షణ, అంతరిక్ష  రంగ ఉత్పత్తుల తయారీలో భాగస్వామ్యమవుతున్న స్వదేశీ సంస్థల జాబితాలో భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) కూడా చేరనుంది. స్పేస్‌ ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థలు.. చిన్న, సూక్ష్మతరహా శాటిలైట్లు.. రాకెట్‌ తయారీ విభాగాల్లోకి అడుగిడాలని ఆ కంపెనీ యోచిస్తోంది. ఇందుకోసం అ వసరమైతే ప్రైవేటు కంపెనీలతోనూ జట్టు కట్టాలని భావిస్తోంది. 2019-20 సంవత్సరానికిగానూ ఆ కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు. సంయుక్త భాగస్వామ్యంలో పోలార్‌ శాటిలైట్‌ లాం చ్‌ వెహికిల్‌ (పీఎ్‌సఎల్‌వీ)ల ఉత్పత్తికి ఇస్రోకు చెందిన న్యూ స్పేస్‌ ఇండి యా లిమిటెడ్‌ (ఎన్‌ఎ్‌సఐఎల్‌) చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్లు బీఈఎల్‌ స్పష్టంచేసింది. ఇస్రో కోసం చిన్న శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ల తయారీపైనా ఆసక్తిని చూపుతున్నట్లు వెల్లడించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగించే మల్టీ జంక్షన్‌ సోలార్‌ (ఎంజేఎస్‌) సెల్స్‌ ఉత్పత్తి కోసం తమ కంపెనీని ఇస్రో ఎంపికచేసిందని బీఈఎల్‌ వార్షిక నివేదికలో ప్రస్తావించింది. 

Updated Date - 2020-09-12T07:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising